వార్తలు (News)

తెలంగాణాలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన!!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి సముద్రమట్టానికి కి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తువరకు కొనసాగుతోంది. ఒడిశా నుంచి తమిళనాడు వరకూ 1.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని,ఈ ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •