రాజకీయం (Politics) వార్తలు (News)

కేసీఆర్ ముక్కు నేలకి రాసి.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి: వైఎస్ షర్మిల!!

వైఎస్సార్‌టీపీతో తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుత్రిక
వైఎస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా
నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి వారానికి ఒక రోజు నిరుద్యోగ దీక్ష చేపట్టారు. అంతే కాకుండా ప్రతి రోజు ఏదో చోట నిరుద్యోగ ఆత్మహత్య సంఘటనలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుని ఆత్మహత్యపై ఆమె తీవ్రంగా స్పందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతూ సీఎం కేసీఆర్‌ది రాతిగుండె, రాక్షసానందం పొందుతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా 26 ఏళ్ల నరేష్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ హత్య చేశారని ఆమె మండిపడ్డారు. రోజుకో నిరుద్యోగి హత్యతో రాక్షసానందం పొందుతున్న రాతిగుండె కేసీఆర్‌ అని, ఇంకెంత మందిని పొట్టనపెట్టుకొంటారు అని, ఇంకెంత మంది చనిపోతే నోటిఫికేషన్స్ విడుదల చేస్తారని షర్మిల సూటి ప్రశ్నలు సంధించారు.

ఇప్పడికే వందల మంది నిరుద్యోగులు చనిపోయారని.. ఇంకెంతమంది తల్లులు చేతికందిన కొడుకులను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తే మీ కండ్లు చల్లబడుతాయంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసిందని ప్రశ్నించారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేక పోతుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ ముక్కు నేలకి రాసి, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి ఇంకా మనిషినేనని నిరూపించుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •