జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

దేశీయ విమాన ప్రయాణ టికెట్ల గరిష్ఠ, కనిష్ఠ ధరల పెంపు!!

దేశీయ విమానాల టికెట్‌ ధరలపై గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను పెంచుతున్నట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ త్తర్వులు జారీ చేసింది. గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత మే 25న విమాన సేవలు మళ్లీ ప్రారంభమయ్యాక ప్రయాణ సమయాన్ని బట్టి ప్రభుత్వం టికెట్ల ధరలపై పరిమితులు విధించింది. విమాన సంస్థలను ఆదుకోవడానికి కనిష్ఠ పరిమితి, డిమాండ్‌ ఎక్కువ ఉన్నప్పుడు ప్రయాణికులపై అధిక భారం మోపకుండా ఉండేందుకు గరిష్ఠ పరిమితి విధించింది. వీటిని గరిష్ఠంగా 12.5% మేర సవరించింది. ఈ ధరలకు అదనంగా ప్రయాణికుల భద్రత రుసుము, విమానాశ్రయాల అభివృద్ధి రుసుము, జీఎస్టీలను చెల్లించాల్సి ఉంటుంది. సీట్ల భర్తీ పరిమితిని 65నుంచి 72.5 శాతానికి పెంచింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •