టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

శిశువులను భారంగా భావించే తల్లులూ చెత్త కుప్పల్లో కాదు ఈ ఊయల్లో వేయండి!

సంగారెడ్డి మహిళా ప్రాంగణం ఆవరణలో ఊయల ఏర్పాటు చేసారు. అది ఎందుకనుకుంటున్నారా? శిశువులను భారంగా భావించే తల్లుల కోసం.. అవును మీరు చదివినది నిజమే! కారణమేదైనా కావొచ్చు.. పుట్టిన నెత్తుటి గుడ్డును వదుల్చుకోవాలని కొందరు తల్లులు, రోడ్ల పక్కన చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. కానీ ఆ పని చేయొద్దని, శిశువులను వద్దనుకుంటే తమ కార్యాలయం దగ్గర ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఊయల్లో వేయాలని సంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు!

దీనికోసం సంగారెడ్డి జిల్లా కేంద్రం మహిళా ప్రాంగణం ఆవరణలోని శిశుగృహం వద్ద గురువారం ప్రత్యేకంగా ఓ ఊయలను ఏర్పాటు చేశారు శిశువులను అక్కడ వదిలిపెడితే తెలిసిపోతుందేమన్న ఆందోళన అక్కర్లేదని, ఊయ ల ఏర్పాటు చేసిన చోట ఎలాంటి సీసీ కెమెరాలూ ఉండవని, ఎవరికీ తెలియదని చెప్పారు.

ఆ శాఖ జిల్లా అధికారి పద్మావతి, బాలిక సంరక్షణ అధికారి రత్నం, సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌ సంస్థ ప్రతినిధులు డాక్టర్‌ చక్రపాణి, డాక్టర్‌ శంకర్‌బాబు, ప్రిన్సిపాల్‌ కళింగ కృష్ణకుమార్‌, జైలర్‌ శివకుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గాయత్రి, మైత్రీ ఫౌండేషన్‌ నిర్వాహకుడు ఉదయ్‌కుమార్‌ సహకారంతో ఈ ఊయలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఇద్దరు శిశువులకు ‘సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌’ ప్రతినిధులు నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఇలాంటి ఊయలలను త్వరలో జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రుల ఆవరణలో ఏర్పాటు చేస్తామని బాలికా సంరక్షణ అధికారి రత్నం తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •