జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇకపై ఓన్లీ జీపీఎస్.. దూరాన్ని బట్టి ఆటోమేటిక్ గా బ్యాంకు ఖాతా నుండే చెల్లింపు??

రష్యాకు చెందిన టెక్నాలజీ ద్వారా జీపీఎస్ అనే- గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ను అత్యంత త్వరలోనే వాడకంలోకి తెస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు. అదే జీపీఎస్ తో కూడిన టోల్ ఫీజుల వ్యవస్థ రాబోవు రోజుల్లో టోల్ ప్లాజాలు- వాటిల్లోని బూత్ లను పూర్తిగా లేకుండా చేయడానికే అందుబాటులోకి తీసుకు రానున్నట్టు చెప్తున్నారు. అయితే వాహనం ప్రయాణించే దూరాన్నిబట్టీ.. ఈ- వాలెట్ లేదా వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుంచి టోల్ ఫీజు డిడెక్ట్ అవుతుంది.

ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఎలెక్ట్రానిక్ టోల్ వ్యవస్థ అమల్లో ఉంది.. దీన్ని జాతీయ రహదారుల సంస్థ నిర్వహిస్తోంది.. ఇకపై దీన్ని కూడా లేకుండా చేస్తామనీ.. ఏడాది లోపు జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని లోక్ సభలో చెప్పారు నితిన్ గడ్కరీ. ప్రస్తుతం తయారవుతున్న వాహనాలన్నీ గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్ తో అనుసంధానమై ఉన్నాయ్. పాత బండ్లలో ఈ విధానాన్ని తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు కేంద్రమంత్రి గడ్కరీ.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •