క్రైమ్ (Crime) వార్తలు (News)

మహిళలూ.. నకిలీ డాక్టర్ లతో జర జాగ్రత్త??

చత్తీస్‌గఢ్‌లోని దంతరి లో ఒక డాక్టర్ దగ్గరకు ఓ మహిళ వెళ్లింది. 8 ఏళ్లుగా పిల్లలు కాకపోవడంతో ఈ డాక్టర్‌ను సంప్రదించి మూడుసార్లు అతడి దగ్గరకు వచ్చింది. రెండుసార్లు అతడు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడో అతడు ఇచ్చే మత్తు కారణంగా ఆమెకు తెలియలేదు. అయితే మూడోసారి ఆమెకు కాస్త స్పృహ ఉండటంతో అతడు తనపై లైంగిక దాడి చేసిన విషయం ఆమెకు తెలిసింది. ఈ విషయం బయట చెబితే అంతం చేస్తానని బాధితురాలిని ఆ ఫేక్ డాక్టర్ బెదిరించాడు.

మొదట్లో భయపడిన తరువాత తేరుకున్న ఆమె పోలీసులకు ఈ విషయం తెలిపింది. విషయం తెలుసుకున్న ఫేక్ డాక్టర్ ఫోన్ నంబర్లు మార్చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఎట్టకేలకు అతడు ఎక్కడ ఉన్నాడనే విషయం తెలుసుకున్న పోలీసులు.. పేషెంట్ అని చెప్పి అతడి అపాయింట్‌మెంట్ కోరారు. ఇందుకోసం డబ్బులు ఎక్కువ ఇస్తామని ఆశ చూపించారు. అతడు ఒప్పుకోవడం లేడీ కానిస్టేబుల్ అతడి దగ్గరకు వెళ్లి అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •