క్రైమ్ (Crime) వార్తలు (News)

నాగ పంచమి సందర్భంగా అసలైన సర్పాలకే పూజలు!!

నాగ పంచమి సందర్భంగా పుట్టకు పాలుపోయడం, నాగ దేవత విగ్రహాలకు పూజలు చేయడం మనకు తెలిసిందే! కానీ కర్ణాటకలోని ఉడుపి జిల్లా కాపు పట్టణానికి చెందిన గోవర్ధన్‌ భట్‌ అనే పాములు పట్టే నిపుణుడు మాత్రం అసలైన సర్పాలకే పూజలు చేస్తుంటారు. మూడు దశాబ్దాలుగా పాముల్ని బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడుతున్న ఆయన ఇప్పటి వరకు వెయ్యి సర్పాలను రక్షించారు.

శుక్రవారం నాగపంచమి సందర్భంగా రెండు నాగుపాములకు మంగళహారతులిచ్చి ప్రత్యేకంగా పూజించి తనకు ప్రతి సంవత్సరం నిజమైన పాములకు పూజలు చేసే భాగ్యం లభిస్తోందని, ఈ పూజలను అక్కడి వారు ఆసక్తిగా వీక్షించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •