ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

లివర్‌ సమస్యలు దూరం చేసే ఆహార అలవాట్లు!!

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇది శరీర జీర్ణక్రియ ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్య వంతంగా ఉంటామని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉన్న కార్బోహైడ్రేట్లను విచ్చిన్నం చేసి గ్లూకోస్ తయారుచేయడానికి కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా కాలేయం పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. కాలేయం ఆరోగ్యవంతంగా పనిచేసినప్పుడే మనం తీసుకునే ఆహార పదార్థాలు సక్రమంగా జీర్ణమై ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటామని పేర్కొంటున్నారు. మీ ఆహారంలో పానీయాలను తీసుకోవడం ద్వారా లివర్ ను శుభ్రం చేసుకోవచ్చు.

పసుపు టీ :
పసుపులో ఎన్నో ఔషధగుణాలుండడంతో దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇది యాంటిబయోటిక్‌లా పనిచేసి శరీరంలోని టాక్సిన్‌లను తొలగించడానికి దివ్య ఔషధంలా పనిచేస్తూ రోజూ పసుపు టీ తాగితే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మెంతి టీ :
మెంతి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు.. జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ మెంతి నీటిని పడుకునే ముందు తాగాలి. ఒక గ్లాసు వేడినీటిలో ఒక టీస్పూన్ మెంతిపొడి వేసి తాగితే మంచిది.

పుదీనా టీ :
పుదీనా ఆకులు పలు సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. వీటిలోని మెంతాల్‌ లక్షణాలు డిటాక్స్‌ చేయడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్లాసు నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి మరిగించి.. తాగితే మంచిది. రాత్రి పడుకునే ముందు తాగితే ఇంకా మేలని పేర్కొంటున్నారు.

అల్లం, నిమ్మ టీ :
నిమ్మ నీటిలో అల్లం కలిపి తాగితే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా బరువు తగ్గిస్తుంది. దీంతోపాటు జీవక్రియను మెరుగు పరచి కాలేయ వ్యాధులను అరికడుతుంది.

చామంతి టీ :
చమోమిలే టీ (చామంతి టీ) ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది. మరిగే నీటిలో 1 స్పూన్ చమోమిలే వేసి తాగితే చాలా మంచిది.

దాల్చిన చెక్క టీ :
దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి పేగులు, కాలేయాన్ని శుభ్రపరచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •