అంతర్జాతీయం (International) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ప్రపంచంలో అత్యంత సెక్యూర్‌ ఫోన్‌ తయారు చేసిన నైట్రోకీ కంపెనీ!!

ఆఫీసు పనులు నుంచి వ్యక్తిగత పనుల వరకు అన్నీ స్మార్ట్‌ ఫోన్‌తోనే చేసుకునే రోజులు వచ్చాయి. బ్యాంకింగ్‌ నుంచి మొదలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వరకు అన్ని పనులను స్మార్ట్‌ ఫోన్‌ చేసే రోజులు వచ్చాయి. ఇలా నిత్య జీవితంలో భాగమైపోవడంతో హ్యాకింగ్‌ కూడా సాధారణమైపోయింది. స్మార్ట్‌ ఫోన్‌లను చాలా సులువుగా హ్యాకింగ్‌ చేయొచ్చనే వాదన ఎప్పటి నుంచే ఉంది. మరి అసలు హ్యాకింగ్‌కు గురికాని స్మార్ట్‌ ఫోన్‌ ఈ భూమ్మీద లేదా అని అంటే జర్మనీ నుంచి ఉందనే సమాధానం వస్తోంది. జర్మనీకి చెందిన ఓ సంస్థ రూపొందించిన స్మార్ట్‌ ఫోన్‌ ప్రపంచంలో అత్యంత సెక్యూర్‌ ఫోన్‌గా నిలిచింది.

జర్మనీకి చెందిన నైట్రోకీ కంపెనీ తయారు చేసిన నైట్రోఫోన్‌ 1 ఫోన్‌ అత్యంత సురక్షితమైన స్మార్ట్‌ ఫోన్‌గా ‘9 To 5 Google’ నివేదికలో వెల్లడైంది. అత్యంత సురక్షితమైన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల రూపకల్పకు పెట్టింది పేరైన నైట్రోకీ కంపెనీ తయారు చేసిన ఈ ఫోన్‌లో సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఫోన్‌లో గూగుల్‌కు సంబంధించి ఎలాంటి యాప్స్‌ రావు, అంతేకాకుండా ఇందులో గూగుల్‌ మ్యాప్స్‌, గూగుల్‌ ఫొటోస్‌ వంటి యాప్స్‌కు యాక్సెస్‌ ఉండదు.

అంతే కాకుండా ఆన్‌లైన్‌లో సురక్షితమైన బ్రౌజింగ్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక క్రోమియం బ్రౌజర్‌ను అందించారు. అలాగే ఈ ఫోన్‌ IMEI నెంబర్‌, మ్యాక్‌ అడ్రస్‌ అందరికీ కనిపించదు. ఈ ఫోన్‌ మన కరెన్సీలో రూ. 50 వేలకు పైమాటే. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్ కెర్నల్, వెబ్‌వ్యూ, కంపైలర్ టూల్‌చైన్, ఫైల్ సిస్టమ్ యాక్సెస్ వంటి ఫీచర్లను కూడా అందించడంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ సురక్షితంగా ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •