జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టుల నోటిఫికేషన్!!

ఇండియన్‌ నేవీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ లో 2022 జూన్‌ (ఏటీ 22) కోర్సు కోసం అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి..

మొత్తం 181 ఖాళీలకు గాను ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ (90), ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్‌) -18, టెక్నికల్‌ బ్రాంచ్‌ (73) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థులను షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 201-09-2021న ప్రారంభమవుతుండగా 05-10-2021తో ముగియనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •