టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఆన్‌లైన్‌లో లభించనున్న సర్వదర్శనం టోకెన్లు.. ఎప్పటి నుండి అంటే..??

శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవల పునఃప్రారంభించిన టీటీడీ ఇప్పుడు ఇందుకు సంబంధించి టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనిపై చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. ఎక్కువ మందికి శ్రీవారి సర్వదర్శనం కల్పించాలని కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వారంలోపు సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో టీటీడీ ఉన్నట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని, నిబంధనలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక నుంచి రోజుకి 8 వేల చొప్పున ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •