క్రైమ్ (Crime) వార్తలు (News)

మండపేటలో రూ.26 లక్షల నగదు, బంగారం మాయం!!

పట్టణ పరిధిలోని కపిలేశ్వరపురం రోడ్ లో తాళంవేసి ఉన్న ఇంటి తలుపు తాళం పగలగొట్టి అలమరలో ఉన్న రూ. 26.30 లక్షలు, అక్కడే ఉన్న రూ.4 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. మండపేట రెడ్డివారి వీధిలోని బోనగిరి సూర్యనారాయణ మూర్తి (కిరణ్) కుటుంబం నివసిస్తున్నారు. ఇంటికి కూతవేటు దూరంగా కెపి రోడ్ లో బోనగిరి రెడీమేడ్స్ షాప్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో కిరణ్ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో తన భార్య అమృత, ఇద్దరు పిల్లలతో కాకినాడ అత్తవారింటికి వెళ్లగా ఆయన తల్లి రాజరాజేశ్వరి ఇంటికి తాళం వేసి రెడీమేడ్ షాప్ కు వెళ్లారు. షాపు నుండి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండటంతో కంగారు పడ్డ ఆమె వెంటనే కుమారుడు కిరణ్ కు ఫోన్ లో విషయం చెప్పారు. నగదుతో బాటు బంగారు ఆభరణాలు గల్లంతు అయినట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ నున్న రాజు, ఎస్ ఐ రాజేష్ కుమార్ లు సంఘటన స్థలంకు చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. క్లూస్ టీం రప్పించారు.

ఈలోపు కిరణ్ కాకినాడ నుండి ఇంటికి చేరుకున్నారు. ఆయన గది, రాజేశ్వరి గదితో బాటు చిన్నారులు గదిలో అనుమానితులు తిరిగినట్లు గమనించారు. చిన్నారులు దాచుకున్న రూ.30 వేలు నగదు ఉన్న ఓ బాక్స్ చోరీకి గురైనట్లు గుర్తించారు. కాగా ఎక్కడి సామాన్లు అక్కడే ఉండి, ఎలాంటి చిందర వందర లేకుండా దొంగతనం చేశారు. బీరువాలను ఏ మాత్రం ముట్టుకోకుండా చోరీ చేసి భారీ నగదుతో ఉడాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రామచంద్ర పురం డిఎస్ పి బాల చంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసు ఛేదిస్తామని చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •