క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

ఆశిష్‌ మిశ్రాకు కోర్టులో చుక్కెదురు!!

లఖింపుర్‌ ఖీరి ఘటనలో అరెస్టైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు కోర్టులో బెయిల్‌ నిరాకరించింది. ఆయనతో పాటు ఆ కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాను అక్టోబర్‌ 9న యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ అరెస్టు చేసిన విషయం పాఠకులకు విదితమే! అంతకుముందు దాదాపు 12గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిపినప్పటికీ ఆయన సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అరెస్టైన ఆశిష్‌కు కోర్టు 14రోజుల కస్టడీ విధించింది.

విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరడంతో న్యాయస్థానం మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం ఆశిష్‌ మిశ్రా పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ముఖ్యంగా ఘటన జరిగిన సమయంలో ఆశిష్‌ మిశ్రా ఎక్కడ ఉన్నారనే అంశంపైనే పోలీసులు ఎక్కువ దృష్టి సారించి ఇందులో భాగంగా ఆశిష్‌ అనుచరుడు అంకిత్‌ దాస్‌ను గంటపాటు పోలీసులు వేర్వేరుగా ప్రశ్నించారు. అయితే, ఘటన జరిగిన సమయంలో ఆశిష్‌ మిశ్రా అక్కడ లేరనే అంకిత్‌ దాస్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో వీరిద్దరినే కాకుండా మరో నలుగురి అనుమానితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •