క్రైమ్ (Crime) వార్తలు (News)

ఊరెళ్తుంటే ఇల్లు జాగ్రత్త!!

దసరా పండుగకు ఊరు వెళ్లేవారు చాలా ఎక్కువమంది ఉంటారు. ఇలాంటి వారి కోసమే ఇల్లు జాగ్రత్త అని సూచించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేసే అవకాశాలున్నాయని, ఊరెళ్లేవారు పక్కింటివారికి చెప్పి కాస్త గమనించమని చెప్పాలని, అనుమానిత వ్యక్తులపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దొంగతనాలకు పాల్పడుతారని, ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా ఉంటే మంచిదన్నారు.

వీలైతే బంగారం, క్యాష్ ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలని, ఇంట్లో ఉన్న సీక్రెట్ కెమెరా ఉన్నవారు వాటిని పనిచేసే విధంగా చెక్ చేసుకోవాలన్నారు. ఎలాంటి అనుమానాలు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •