క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు మూడు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రధాన పార్టీల నేతలందరూ మాటల తూటాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ మాటల కుంపటి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై హుజూరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి సభ నిర్వహించారని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హుజూరాబాద్ పోలీసులు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    3
    Shares
  • 3
  •  
  •  
  •  
  •