జాతీయం (National)

జవాన్లు.. రాష్ట్రపతి .. దసరావేడుకలు??

గత సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈసారి దసరా వేడుకలను లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే దసరా వేడుకల్లో పాల్గొంటుంటారు కానీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రేపు, ఎల్లుండి జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది. గురువారం ఆయన లేహ్‌లోని సింధు ఘాట్‌ వద్ద సింధు దర్శన్‌ పూజలో పాల్గొని సాయంత్రం జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో బలగాలతో మాట్లాడతారు. ఈ నెల 15న ద్రాస్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన అధికారులు, జవాన్లతో ముచ్చటించనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •