టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

దసరాకి సికింద్రాబాద్ – ఏపీ మధ్య మూడు ప్రత్యేక రైళ్లు??

దసరా పండుగ రద్దీ కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఏపీకి మరో మూడు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్-కాకినాడ టౌన్, మచిలీపట్టణం-సికింద్రాబాద్, లింగంపల్లి-విజయవాడ రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07550) రైలు ఇవాళ (14న) రాత్రి 11.55 గంటలకు, మచిలీపట్టణం-సికింద్రాబాద్ రైలు (07450) రాత్రి 9.05 గంటలకు, లింగంపల్లి-విజయవాడ రైలు (07451) 18న రాత్రి 10.45 గంటలకు బయలుదేరుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఈ రైళ్లను దసరా పండుగ ప్రత్యేక రైళ్లుగా నడిపించనున్నట్టు తెలిపింది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ రైలు కాజీపేట, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు మీదుగా వెళ్తుందని, మిగతా రెండు రైళ్లు కాజీపేట, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణిస్తాయని పేర్కొంది. పండుగ రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    11
    Shares
  • 11
  •  
  •  
  •  
  •