రాజకీయం (Politics) వార్తలు (News)

నేడు తెలంగాణకు బ్లాక్‌ డే: పొన్నాల లక్ష్మయ్య!!

రాష్ట్ర పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలపై కేంద్రం అజమాయిషీ ఏంటని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. నీటిపై పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్రానిది, అందుకు అవకాశం ఇస్తున్న రాష్ట్రానిది రెండూ తప్పేనని, కేసీఆర్‌ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని, తెలంగాణ ద్రోహిగా నిలిచిపోతారని పొన్నాల ఆరోపించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఒకేసారి జలయజ్ఞంలో భాగంగా 86 ప్రాజెక్టులు ప్రారంభించామని, కేసీఆర్‌ ఇప్పుడు వెలగబెట్టిందేముందని, రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం వల్ల ఎంత లాభం జరుగుతుందో కేసీఆర్‌ చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ ఒంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయని, అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్‌డేగా నిలిచిపోతుందని అన్నారు.

దేశ వ్యాప్తంగా బొగ్గులేక పవర్‌ ప్లాంట్‌లు మూతపడుతున్నాయని, అనేక రాష్ట్రాల్లో పవర్‌ కట్‌లు కొనసాగుతున్నాయని, భాజపా ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా వాస్తవ పరిస్థతి వచ్చేసరికి ప్రజలకు నిజం తెలుస్తుందని, కేంద్రం వద్ద భవిష్యత్‌ ప్రణాళిక లేకపోవడమే ఇప్పుడు బొగ్గు కొరతకు కారణమని, కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మెగావాట్‌ పవర్ కూడా ఇప్పటి వరకు ఉత్పత్తి చేయలేదని పొన్నాల ఆరోపించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •