దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 9,90,482 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 5,784 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 252 మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకు మరణించినవారి మొత్తం సంఖ్య 4,75,888 కు చేరింది. గత 24 గంటల్లో 7,995 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.41 కోట్లకు చేరింది. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 88,993 కు చేరింది.