ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిగిన సంగతి పాఠకులకు విదితమే!

ప్రస్తుతం లక్ష్మీనారాయణ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 10న సీఐడీ తనిఖీల జరుపుతుండగా అధిక రక్తపోటుతో
ఆయన ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 12 గంటల తర్వాత లక్ష్మీ నారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్‌పై డాక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.

వైద్యులు డిశ్చార్జ్‌ చేస్తేనే సీఐడీ కార్యాలయానికి లక్ష్మీ నారాయణ వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ కేసులో ఎ2గా లక్ష్మీనారాయణ ఉన్నారు. మరోవైపు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేయగా పిటీషన్‌ను కూడా హైకోర్టు అనుమతించింది.