దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆజాదీకా అమృతోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ ఫెయిర్‌లో 75 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. జేఎన్టీయూహెచ్‌, నిపుణ, సేవా ఇంటర్నేషనల్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్టు, ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే ఈ జాబ్ ఫెయిర్‌లో 150కి పైగా కంపెనీలు పాల్గొంటాయని నిపుణ సంస్థ ఫౌండర్‌ సుభద్రారాణి తెలిపారు. టెన్త్, ఇంటర్, బీఈ, బీటెక్, డిగ్రీ/పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు సూచించారు.

జాబ్ ఫెయిర్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఐటీ, ఐటీఈఎస్‌, కోర్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మా, బ్యాంకింగ్‌ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొనేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఫీజు లేదని, నిపుణ వెబ్‌సైట్‌ www. nipunahds.com ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 9848484264, 8790006745 నంబర్లలో సంప్రదించండి.