దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 361 పాయింట్ల నష్టంతో 57,921 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 17,268 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.