ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ బేధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య ఉంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలామంది కంగారుపడి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడతారు. కానీ తాత్కాలిక ఫలితం మాత్రమే పొందుతారు. అదే మన ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నిస్తే కచ్చితంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అసలు జుట్టు రాలడానికి కారణాలు ఏమిటో కూడా తెలుసుకుంటే ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయవచ్చు. కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా జుట్టును తిరిగి పెంచుకోవచ్చు.

ఒక గిన్నెలో గ్లాసున్నర నీటిని పోసి దానిలో గుప్పెడు కరివేపాకు ఆకులు, ఒక స్పూన్ కలోంజీ సీడ్స్, అరస్పూన్ మెంతులు వేసి పొయ్యి మీద పెట్టి 10 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి కొంచెం చల్లారాక జుట్టుకి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ చిట్కాను వారంలో 2 సార్లు నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన మెంతులు,కరివేపాకు, కలోంజీ సీడ్స్ ఇంచుమించుగా అందరికీ అందుబాటులో ఉంటాయి. కాస్త శ్రద్ద పెడితే చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.