దేశీయ మార్కెట్ సూచీలు నేడు ఆద్యంతం నష్టాల్లో కదలాడాయి. ఉదయం సెన్సెక్స్ 58,059.76 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 57,803.87 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 166.33 పాయింట్ల నష్టంతో 58,117.09 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,283.20 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,376.20-17,225.80 మధ్య కదలాడి చివరకు 43.35 పాయింట్లు నష్టపోయి 17,324.90 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టైటన్, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల బాట పట్టగా.. భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి.