దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 16.13 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే 2,68,833 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే 402 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.85 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో 1.22 లక్షలకుపైగా రోగులు కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొతం రికవరీ రేటు 94.83 శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం 14 లక్షలు పైగా క్రియాశీల కేసులున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6041కి చేరింది.