ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 35,673 శాంపిల్స్‌ పరీక్షిస్తే 4,955 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,01,710కి పెరిగింది. నిన్న కరోనా కారణంగా ఒకరు మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,509కి చేరింది. గత 24 గంటల్లో 397 మంది బాధితులు కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 20,64,331కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 22,870 కి చేరింది.