సంక్రాంతి పండగకు ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో తమిళనాడులో జల్లికట్టు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. సంక్రాంతి పండుగకు జల్లికట్టు నిర్వహించడం సాంప్రదాయంగా భావిస్తారు.

గతంలోనే జల్లికట్టు ప్రమాదకరమైన క్రీడ అని నిషేధించాలంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ సాంప్రదాయ క్రీడను అదుపు చేయలేకపోయారు. ఇక ఇప్పుడు తాజాగా జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి.

కరోనా కేసులు పెరుగుతుండడంతో కేవలం 150 మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ జల్లి కట్టును చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అంతేకాకుండా కరోనా నిబంధనలు బ్రేక్ చేశారు. ముఖాలకు మాస్క్ లు ధరించకుండా ఇష్టం వచ్చినట్టు కనిపిస్తున్నారు. మధురై లోని అవనియాపురం లో జల్లికట్టు ప్రారంభించిన కొద్ది సేపటికే ఎద్దు దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.