విశాఖపట్నంలోని ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(VCBL) ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో 2022 జనవరి 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 30 గా ఉన్నాయి. విద్యార్హతకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు తెలుగు, ఇంగ్లిష్ మాట్లాడడం, చదవడం రావాలి. వయోపరిమతికి సంబంధించి 2021 డిసెంబర్ 31 నాటికి 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఉద్యోగ ఎంపిక కోసం, ఆన్ లైైన్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000 వేతనం చెల్లిస్తారు. రాత పరీక్షలో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూ 25 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్, ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.vcbl.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.