రాజకీయం (Politics)

ఉక్కు ప‌రిశ్ర‌మ‌కై ఏపీ బీజేపీ కీల‌క అడుగు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని ఆపేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఇవాళ ఏపీ బీజేపీ ముఖ్య నాయ‌కులు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో భేటీ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్య‌క్షులు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, ఎమ్మెల్సీ మాధ‌వ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు త‌దిత‌రులు మంత్రిని క‌లిసి విన‌తిప‌త్రాన్ని స‌మ‌ర్పించారు.

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఆంధ్రులు ఎన్నో ఉద్య‌మాల ద్వారా సాధించుకున్నార‌ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉక్కు ప‌రిశ్ర‌మ ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు సంబంధించిన అంశ‌మ‌ని, ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించాల‌నే నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న చేయాల‌ని వారు కోరారు. ప‌రిశ్ర‌మ‌ను లాభాల్లోకి తీసుకురావ‌డానికి, ప‌రిశ్ర‌మ‌ను న‌డిపించ‌డానికి ఉన్న ప్ర‌త్యామ్నాయాల‌ను వారు మంత్రికి వివ‌రించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.