కేవలం భారతదేశంలోనే పొరుగు రాష్ట్రాలైన నేపాల్, శ్రీలంకలోనూ భారతీయ జనతా పార్టీని విస్తరించే ఆలోచనతో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు ఆ పార్టీకి చెందిన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగర్తలాలో జరిగిన ఓ కార్యక్రమంలో బిప్లవ్ మాట్లాడుతూ… నేపాల్, శ్రీలంక దేశాల్లోనూ బీజేపీని అధికారంలోకి తెచ్చే వ్యూహాలు అమిత్ షా వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అమిత్ షానే స్వయంగా బీజేపీ ఈశాన్య రాష్ట్రాల కార్యదర్శి అజయ్ జమ్వాల్తో చెప్పారని బిప్లవ్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీని మార్చేందుకు అమిత్ షా కృషి చేస్తున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.