ఎన్నికలు (Elections)

ఎస్ఈసీకి షాకిచ్చిన హైకోర్టు.. ప్ర‌భుత్వానికి గ్రీన్ సిగ్న‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. రేష‌న్ వాహ‌నాల విష‌యంలో గ‌తంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై కోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం రేష‌న్ వాహ‌నాల ద్వారా ఇంటింటికి రేష‌న్ స‌రుకులు అందిస్తోంది. అయితే, ఈ వాహ‌నాల‌పై వైసీపీ రంగులు ఉన్నాయ‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ఫోటోలు ఉన్నాయ‌నేది ఎన్నిక‌ల క‌మిష‌న్ వాద‌న‌.

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఈ వాహ‌నాల‌ను స్వ‌యంగా ప‌రిశీలించి వాహ‌నాల రంగుల‌ను మార్చాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించారు. ఈ నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం హైకోర్టుకు వెళ్లింది. ప్ర‌భుత్వ పిటీష‌న్‌ను విచారించిన కోర్టు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను మార్చి 15 వ‌ర‌కు నిలిపివేసింది. రేష‌న్ స‌రుకుల పంపిణీకి ప్ర‌భుత్వానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.