మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో ఆదివారం రాత్రి అరటిలోడు వెళ్తున్న ట్రక్ అదుపు తప్పి బోల్తా పది 16 మంది కూలీలు మరణించారు.వీరిలో 8 పురుషులు, 6 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు.మరొక 5 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా జలగావ్ జిల్లాలోని అభోడా, కేర్హళ, రేవర్‌ గ్రామాలకు చెందిన వారు.ప్రమాద సమయంలో మొత్తం
21 మంది కార్మికులు ఆ ట్రక్ లో ఉన్నారు .
మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు కింగ్వాన్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. . సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను రూరల్ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కూలీలు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం