ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. గ‌త సంవ‌త్స‌రం మార్చి 11న మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మై నామినేష‌న్ల దాఖ‌లు కూడా జ‌రిగింది. ఆ త‌ర్వాత క‌రోనా కార‌ణంగా ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. అప్పుడు ఆగిన ప్ర‌క్రియ‌నే ఇప్పుడు కొన‌సాగించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యించింది. మార్చ్ 3 వ‌ర‌కు నామినేష్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంది. మార్చ్‌ 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 13న‌ రీపోలింగ్ ఉంటుంది. 14న కౌంటింగ్ జ‌రుగుతుంది.

మొత్తం 12 మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు, 75 మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, ఏలూరు, విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుప‌తి, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌కు ఎన్నిక‌లు జరుగుతాయి. రాజ‌మండ్రి ఎన్నిక‌లు కోర్టు కేసు కార‌ణంగా వాయిదా ప‌డింది.