వార్తలు (News)

ఈ ఏడాది వేతనాలు పెరుగుదల పై ప్రముఖ సర్వే అంచనాలు

2021లో భారత్‌లో ఉద్యోగుల వేతన పెంపు సగటు 6.4 శాతంగా ఉండే అవకాశం ఉందని విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ సర్వే నివేదిక అంచనా. గత ఏడాదిలో నమోదైన 5.9 శాతం సగటుతో పోలిస్తే ఈసారి జీతభత్యాలు కాస్త మెరుగుపడనున్నాయని,కరోనా సంక్షోభంతో కుదేలైన కార్పొరేట్‌ రంగం భారీగా పుంజుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని,అదే స్థాయిలో వేతన పెంపు బడ్జెట్‌లో పెరుగుదల ఉండకపోవచ్చని విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ ఇండియా టాలెంట్‌ అండ్‌ రివార్డ్‌ విభాగ అధిపతి రాజుల్‌ మాథుర్ అభిప్రాయపడ్డారు.

సంస్థల్లో కీలక ఉద్యోగులు, అత్యంత మెరుగైన ప్రతిభ కనబరిచే వారికి ఈ ఏడాది సగటున 20.6 శాతం వేతన పెంపు ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. ఈ కేటగిరీ కిందకు వచ్చే ఉద్యోగులు మన దేశంలో 10.3 శాతం మంది ఉన్నారు. ‘శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ రిపోర్ట్‌’ పేరిట రూపొందించిన ఈ నివేదిక గత ఏడాది అక్టోబరు/నవంబరులో ఆన్‌లైన్‌ ద్వారా 130 దేశాలకు చెందిన 18,000 కంపెనీల ప్రతినిధుల నుంచి సేకరించిన సమాచారంతో సర్వే చేసి తయారు చేశారు.ఆ సర్వేలో పాల్గొన్న భారత కంపెనీల్లో 37 శాతం వరకు వచ్చే సంవత్సర కాలంలో ఆదాయంపై సానుకూలంగా ఉన్నట్లు,ఉద్యోగ నియామకాలు మాత్రం ఇంకా పుంజుకోవాల్సి ఉన్నట్టు తేలింది. కేవలం 10 శాతం కంపెనీలు మాత్రమే కొత్త ఉద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఆసక్తి కనబరిచాయని తెలిపారు.

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని ఇండోనేసియాలో 6.5 శాతం, చైనాలో 6 శాతం, ఫిలిప్పీన్స్‌లో 5 శాతం, సింగపూర్‌లో 3.5 శాతం, హాంకాంగ్‌లో 3 శాతం వేతన పెంపు ఉండొచ్చని సర్వే లెక్క గట్టింది. సాంకేతిక, ఔషధ, కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్ అండ్‌ రిటైల్ రంగాల్లోని ఉద్యోగులకు సగటున 8 శాతం జీతం పెరిగే అవకాశం ఉందని లెక్కగట్టింది. ఆర్థిక సేవలు, తయారీ రంగాల్లో పని చేసే వారి వేతనాలు 7 శాతం, బీపీఓ సెక్టార్‌లో పని చేసే వారి వేతనం 6 శాతం, ఇంధన రంగంలో పని చేసే వారి వేతనం మాత్రం అత్యల్పంగా 4.6 శాతం పెరగొచ్చని ఈ సర్వేలో తేలింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.