ప్రజల గోప్యతను కాపాడటం సుప్రీమ్ కోర్టు తన బాధ్యత అని స్పష్టం చేస్తూ,ఇండియాలో ప్రజల భద్రత కోసం ప్రైవసీ యాప్ పై సుప్రీం కొత్త చట్టం తేనుంది… ఒకపుడు సీక్రెట్స్ ఇద్దరి వ్యక్తుల మధ్యనో లేక నాలుగు గోడల మధ్యనో మాత్రమే ఉండేవి. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా మన చేతుల్లోకి వచ్చిందో.. సీక్రెట్స్ అనే మాట కి చోటులేకుండా పోయింది.. అంతరంగం లో ఉండాల్సిన విషయాలు.. వార్తలుగా బట్టబయలు అవుతున్నాయి.ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే సుప్రీమ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.
అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్, దానికి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇటీవల ప్రవేశపెట్టిన వాట్స్ యాప్ నూతన విధానంపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.ఆ సందర్భంగా మీ సంస్థ రెండు లేదా మూడు ట్రిలియన్ డాలర్ల సంస్థ కావచ్చుఅయినా కూడా మీ కంటే మాదేశ ప్రజల గోప్యతకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తామని సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యానించింది.ప్రజలకు భద్రత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారని వివరించింది. ఎవరికైనా మెసేజ్ పంపితే అది ఫేస్ బుక్ లో ప్రత్యక్షం అయిఉంటోందని ప్రజలు అనుకుంటున్నారని వివరించింది..

విచారణ సందర్భంగా ఫేస్ బుక్, వాట్సాప్ తరపున కపిల్ సిబాల్ వాదిస్తూ… నూతన గోప్యతా విధానం వల్ల యూజర్ల సమాచారం బయటకు వెళ్లదని అన్నారు. ప్రైవసీపై యూరప్ లో ఒక ప్రత్యేక చట్టం ఉందని, ఇండియా కూడా అలాంటి చట్టాలనే తీసుకొస్తే, దాన్ని అనుసరించడం జరుగుతుందని వివరణ ఇచ్చారు.