ముంబై కి చెందిన టాలీవుడ్ హీరో సచిన్ జోషి ఒక వ్యాపారవేత్త అన్న విషయం ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే!సచిన్ జోషిని Rs100 కోట్ల మనీ హవాలా కేసు లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.అరెస్ట్ అనంతరం సచిన్ నివాసం దగ్గర మరియు ఆఫీస్ పరిసరాలలో ఆదాయ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈకేసు లో Rs100 కోట్ల అనుమానిత లావాదేవితో కనెక్షన్ ఉందనే ఆరోపణలతో సచిన్ అరెస్ట్ అయ్యారు.
శనివారం ఈడీ అధికారులు దర్యాప్తు నిమ్మిత్తం సచిన్ జోషి గారిని తీసుకువెళ్లి, 18 గంటలపాటు ప్రశ్నించారు.జోషి, ఓంకార్ గ్రూప్ కి అనేక తప్పుడు డీల్స్ జరిగినట్టు,ఒక స్థిరాస్తి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు రావడం తో ఈడీ ఈ కేసు నమోదు చేసింది.జేఎంజే గ్రూప్ కు కూడా దీనిలో ప్రమేయం ఉందని బయటపడిందని చెప్పారు.జేఎంజే గ్రూప్ ప్రమోటర్ లలో సచిన్ గారు కూడా ఒకరు.ఈరోజు సచిన్ ను ముంబై లో ఒక కోర్ట్ లో హాజరు పరిచారు.