టెక్నాలజీ (Technology) వార్తలు (News)

APBIE క్యాలెండరు విడుదల

ఆన్‌లైన్ అడ్మిషన్స్ పై ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటే కాలేజీల్లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ నిలిపివేయాలని, ఏ నియమాల ఆధారంగా ఏపి ప్రభుత్వం ఆన్‌లైన్ ( Online ) అడ్మిషన్స్ మొదలుపెట్టింది అని ధర్మస్థానం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఏపీలో పాఠశాలలు, కళాశాలల పనిదినాలు ఈ విద్యా సంవత్సరంలో కేవలం 127 రోజులు మాత్రమే కొనసాగుతాయి అని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (APBIE) కీలక నిర్ణయం తీసకుంది. ఏపిలో (Andhra Pradesh) ఏప్రిల్ 24న విద్యా సంవత్సరం ముగుస్తుంది. తరువాత ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం క్లాసులు మార్చి చివరి వారంలో నిర్వహించున్నారు.

కొత్త విద్యాసంవంత్సర క్యాలెండర్ ను ఇంటర్మీడియట్ ( Intermediate) ఎకాడమిక్ కౌన్సిల్ విడుదల చేసి, వచ్చే సంవత్సరం పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను జూన్ చివరి వారంలో నిర్వహిస్తామని, ఈ విద్యా సంవత్సరంలో రెండో శనివారం రోజు కూడా క్లాసులు జరపబోతున్నామని వివరించింది.

మరో వైపు టెర్మ్ లీవ్స్ కూడా ఈ సంవత్సరం రద్దు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 2021-2022 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభం అవుతుంది అని అధికారులు తెలిపారు . మరింత సమాచారం కోసం విద్యార్థులు http://www.bie.ap.gov.in పోర్టల్ చెక్ చేయవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.