ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు సన్నాహాలు చేశారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్బీయూ) 2 రోజుల సమ్మెకు సిద్ధమైంది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల శాఖల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్‌ వంటి సేవలతోపాటు చెక్‌ క్లియరెన్స్‌, రుణ అనుమతులపై ప్రభావం పడనుంది. సమ్మెలో 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొంటారని 9 యూనియన్లతో కూడిన యూఎ్‌ఫబీయూ తెలిపింది. సమ్మెతో ఏటీఎం సేవలకూ ఇబ్బంది కలగవచ్చని ఒక కథనం. ప్రైవేటు బ్యాంకులు తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించనున్నాయి. బ్యాంకు అధికారుల, ఉద్యోగుల సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, టీఎ్‌సయూటీఎఫ్‌ తమ మద్దతు తెలిపాయి.