ఆంధ్రప్రదేశ్‌లో కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం సైతం అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. గత 24గంటల్లో ఏపీలో 147 కరోనా కేసులు నమోదు కాగా, కర్నూల్‌లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8,92,008 కి పెరగగా, మరణించిన వారి సంఖ్య 7,185 కి చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 45,208 నమూనాలను పరీక్షించడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,45,57,366 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 103 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 8,83,380 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,443 కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి

గత కొన్ని రోజుల క్రితం 50-60 కేసులే నమోదు అవుతున్న తరుణంలో ప్రస్తుతం వందకుపైగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలను ప్రారంభించినప్పటికీ కూడ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది.