ఇండియా లో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి చాలా ఎక్కువగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం ఈ కేసుల సంఖ్య 16,620 మందికి చేరుకుంది. 50 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.19లక్షల యాక్టివ్‌ కేసులున్న సమయంలో ఒక్క మహారాష్ట్రలోనే 1,26,231 ఆక్టివ్ కేసులున్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని నాగ్‌పూర్‌ సహా కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది.