2021 సంవత్సరానికి ప్రకటించిన ఆస్కార్ అవార్డుల నామినేషన్ల జాబితాలో ఒక విశేషం చోటు చేసుకుంది. అది 93 సంవత్సరాల ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఇద్దరు మహిళలు ఉత్తమ డైరెక్టర్ విభాగంలో అవార్డుకు ఒకేసారి నామినేట్ అవ్వడం ఇదే మొదటిసారి.

నొమాడ్‌ల్యాండ్ మూవీ దర్శకురాలు క్లో జావ్, ప్రామిసింగ్ యంగ్ విమన్ సినిమా దర్శకురాలు ఎమెరాల్డ్ ఫెన్నెల్ ఇద్దరు ఒకేసారి నామినేషన్లు దక్కించుకుని ఈ చరిత్రను సృష్టించారు. బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించిన ‘మ్యాంక్’ మూవీ మొత్తంగా 10 విభాగాలలో నామినేషన్లతో అగ్రస్థానంలో నిలవగా, గారీ ఓల్డ్‌న్ ఈ సినిమాలో సిటిజన్ కేన్ రచయిత హెర్మన్ మాంకెవిజ్ పాత్ర పోషించారు.

ఈ ఏడాది ఎనిమిది మంది బ్రిటిష్ నటీనటులు, సినీ కళాకారులు ఆస్కార్లకు నామినేట్ కాగా వారిలో సాచా బారన్ – కొహెన్, కేరి ముల్లిగన్, ఒలీవియా కోల్మన్, డేనియల్ కలూయా, సర్ ఆంథోని హాప్కిన్స్ ఉన్నారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల విజేతలను ఏప్రిల్ 25న ప్రకటిస్తారు.

ప్రధాన నామినేషన్లు జాబితా…
అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రాలు…

మ్యాంక్: 10 విభాగాల్లో నామినేషన్లు
ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7: 6 విభాగాల్లో నామినేషన్లు
ద ఫాదర్: 6 విభాగాల్లో నామినేషన్లు
సౌండ్ ఆఫ్ మెటల్: 6 విభాగాల్లో నామినేషన్లు
జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య: 6 విభాగాల్లో నామినేషన్లు
నోమాడ్‌ల్యాండ్: 6 విభాగాల్లో నామినేషన్లు

ఉత్తమ చిత్రం కేటగిరీలో…
ది ఫాదర్
మ్యాంక్
జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య
సౌండ్ ఆఫ్ మెటల్
నోమాడ్‌ల్యాండ్
ప్రామిసింగ్ యంగ్ వుమన్
మినారి
ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7

ఉత్తమ నటి విభాగంలో…
ఆండ్రా డే (యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే)
వయోల డేవిస్ (మా రేనీస్ బ్లాక్ బాటమ్)
కేరి ముల్లిగన్ (ప్రామిసింగ్ యంగ్ వుమన్)
ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ (నోమాడ్‌ల్యాండ్)
వనేసా కిర్బీ (పీసెస్ ఆఫ్ ఎ వుమన్)

ఉత్తమ నటుడు కేటగిరీలో …
రిజ్ అహ్మద్ (సౌండ్ ఆఫ్ మ్యూజిక్)
గేరీ ఓల్డ్‌మాన్ (మ్యాంక్)
చాడ్విక్ బోస్మాన్ (మా రేనీస్ బ్లాక్ బాటమ్)
స్టీవెన్ యూయెన్ (మినారి)
సర్ ఆంథోనీ హాప్కిన్స్ (ద ఫాదర్)

ఉత్తమ సహాయ నటి కేటగిరీలో …
గ్లెన్ క్లోజ్ (హిల్‌బిల్లీ ఎలిజీ)
మారియా బాకలోవా (బోరాట్ సబ్‌సీక్వెంట్ మూవీఫిల్మ్)
ఒలీవియా కోల్మన్ (ద ఫాదర్)
యూ జంగ్ యూన్ (మినారి)
అమాండా సేఫ్రీడ్ (మ్యాంక్)

ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో …
లెస్లీ ఓడామ్ జూనియర్ (ఒన్ నైట్ ఇన్ మియామి)
సాచా బారన్ కొహెన్ (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)
డానియల్ కలూయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య)
లకీత్ స్టాన్‌ఫీల్డ్ (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య)
పాల్ రాసి (సౌండ్ ఆఫ్ మెటల్)