వార్తలు (News)

రెండేళ్లుగా ముద్రణకు నోచని రూ.2000 నోటు

8 నవంబర్ 2016 న పాత కరెన్సీ నోట్లు రద్దైన విషయం పాఠకులకు తెలిసిందే! ఆ రద్దు తర్వాత రెండువేల రూపాయల నోటు మార్కెట్ లోకి విడుదల అయిన సంగతి కూడా పాఠకులకు తెలిసిందే! ఇప్పుడు ఆ నోటు సంఖ్య మార్కెట్ లో బాగా తగ్గిపోయింది. కారణం ఆరా తీయగా గత రెండు సంవత్సరాల నుండి ఆ నోటు ప్రింటింగ్ చేయనేలేదని
ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సమాధానం చెప్పారు. 2019 ఏప్రిల్‌ నుంచి ఒక్క నోటు కూడా ముద్రణ జరగలేదని తెలిపారు.

2018 మార్చి 30 నాటికి 3,362 మిలియన్ల రెండు వేల రూపాయల నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయని, మొత్తం నోట్లలో వీటి వాటా 3.27 శాతం కాగా, విలువ పరంగా 37.26 శాతంతో సమానమని తెలిపారు. 2021 ఫిబ్రవరి 26 నాటికి 2,499 మిలియన్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉండగా, దీని వాటా 2.01 శాతం కాగా, విలువ పరంగా 17.78 శాతమని తెలిపారు.

ఎన్ని నోట్లు ముద్రించాలనేది ప్రజల డిమాండ్‌ని బట్టి ఆర్‌బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఠాకూర్‌ తెలిపారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల రూపాయిల ముద్రణకు సంబంధించి ప్రింటింగ్‌ ప్రెస్‌కు ఎలాంటి ఇండెంట్‌ వెళ్లలేదని చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.