వార్తలు (News)

ఎనిమిది దేశాలలో నిలిచిన ఆస్ట్రాజెనెకా(కోవిడ్) వాక్సీన్

ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సీన్ వినియోగాన్ని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిలిపివేసింది. కోవిడ్-19 సోకకుండా నిరోధించటానికి ఉద్దేశించినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చనే ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ వాక్సీన్ వినియోగాన్ని మార్చి 29వ తేదీ వరకూ నిలిపివేశామని డచ్ ప్రభుత్వం చెప్తోంది.‌

రిపబ్లిక్ ఆఫ్ ఐర్లండ్ కూడా ర్వేలో ఈ వాక్సీన్ తీసుకున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడుతూ సమస్యలు తలెత్తుతున్నాయని వార్తలు రావటంతో ఇంతకుముందే ఆస్ట్రాజెనెకా వాక్సీన్ వినియోగాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

నెదర్లాండ్స్, ఐర్లండ్‌ల కన్నా ముందు డెన్మార్క్, నార్వే, బల్గేరియా, ఐస్‌లాండ్, థాయిలాండ్ దేశా‌లు కూడా ఆస్ట్రాజెనెకా వినియోగాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశాయి. కానీ ఈ వాక్సీన్‌కు, రక్తంలో గడ్డలు ఏర్పడటానికి మధ్య సంబంధం ఉందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

రక్తంలో గడ్డలు ఏర్పడుతున్న సంఘటనలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ప్రస్తుతం సమీక్షిస్తోంది. కానీ ఈ వాక్సిన్ వల్ల వచ్చే ముప్పుల కన్నా దానివల్ల కలిగే ప్రయోజనాలకు ఎక్కువ విలువ ఉందని ఆ సంస్థ చెప్తోంది.

ఈ వాక్సీన్ వల్ల రక్తంలో గడ్డలు తయారవుతున్నాయని ఆధారాలు సూచించటం లేదని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ కూడా పేర్కొంది. దేశ ప్రజలు ఈ వాక్సీన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే, ”వాక్సీన్ గురించి ఎలాంటి సందేహాలకూ మేం తావివ్వలేం. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి దీని వినియోగం ఆపటం మంచిది” అని డచ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లలో గత వారాంతం వరకూ సుమారు 1.7 కోట్ల మంది ఈ వాక్సీన్ డోసు తీసుకుంటే వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడ్డ కేసులు 40 కన్నా తక్కువగానే నమోదయ్యాయని ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో తెలిపింది. ఈయూ, బ్రిటన్ వ్యాప్తంగా ఈ వాక్సీన్ తీసుకున్న వారిలో డీప్-వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ), రక్త నాళంలో గడ్డలు ఏర్పడ్డ కేసులు 15 నమోదయ్యాయని, పల్మనరీ ఎంబోలిజం(రక్తపు గడ్డ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించటం) కేసులు 22 నమోదయ్యాయని వివరించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.