వార్తలు (News)

విజృంభిస్తున్న కరోనా…

దేశంలో 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 26,291 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసులివే. అంతక్రితం రోజుతో పోలిస్తే 3.8శాతం కేసులు పెరిగాయి. దేశంలో ఇప్పటికి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1,13,85,339కి చేరింది. ఇదే సమయంలో 17,455 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,10,07,352 మంది కరోనాను ఓడించగా, రికవరీ రేటు 96.68శాతంగా ఉంది.

కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో దేశంలో ఆక్టివ్ కేసులు మళ్లీ 2లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,19,262 యాక్టివ్‌ కేసులుండగా, క్రియాశీల రేటు 1.93శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో మరొక 118 మంది వైరస్‌కు బలి కావడంతో ఇప్పటి వరకు 1,58,725 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.