వార్తలు (News)

ఒడిదుడుకుల్లో నేటి స్టాక్ మార్కెట్

సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు విపరీతమైన ఒడుదొడుకులను చవిచూశాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతల మధ్య లో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొంచం కొంచంగా దిగజారుతూ పోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ కీలక 50వేల మార్క్‌ను, నిఫ్టీ 15వేల మార్క్‌ను కోల్పోయాయి.

ఉదయం 51,404 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ప్రీట్రేడింగ్‌లో 50,834 వద్ద గరిష్ఠాన్ని తాకి, మధ్యాహ్నం తర్వాత 49,799 వద్ద కనిష్ఠానికి చేరుకుని, చివరకు 397 పాయింట్లు నష్టపోయి 50,395 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,048 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టి, రోజులో 15,048 వద్ద గరిష్ఠాన్ని తాకి, అక్కడి నుంచి 303 పాయింట్లు కోల్పోయి 14,745 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 107 పాయింట్లు నష్టపోయి 14,923 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.47 వద్ద నిలిచింది.

నేడు ఆసియా సూచీలు మిశ్రమంగా కదలాడాయి. చైనా పునరుత్తేజంపై గణాంకాలు ప్రతికూలంగా ఉండడం అక్కడి మదుపర్లను నిరాశ పరిచడంతో, దీంతో షాంఘై కాంపోజిట్‌ నష్టాల్లో ముగిసింది. మరోవైపు అమెరికా సూచీలు గతవారాన్ని ప్రతికూలంగా ముగించి, శుక్రవారం వెలువడిన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తికి సంబంధించిన గణాంకాలు మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపడంతో మధ్యాహ్నం సమయంలో వచ్చిన టోకు ద్రవ్యోల్బణ సూచీ గణాంకాలు తీవ్ర నిరాశ పరచాయి. దీంతో ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను కాసేపు తీవ్రంగా కలవరపెట్టాయి కానీ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి లోహ, విద్యుత్తు, బేసిక్‌ మెటీరియల్స్‌ రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకున్నప్పటికీ లాభాల్లోకి మాత్రం రాలేదు.

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాలను ఆర్జించాయి. కోల్‌ ఇండియా, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌, దివీస్‌ ల్యాబ్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.