వార్తలు (News)

నంద్యాల బ్యాలెట్ బాక్స్ లో వెరైటీ వార్నింగ్

ప్రకటనలు అనేవి రకరకాలుగా ఉంటాయని మనకి తెలిసిందే కానీ ఈసారి ఒక వెరైటీ ప్రకటన కర్నూల్ జిల్లా నంద్యాల గ్రామ వార్డ్ ఓట్ల లెక్కింపులో బ్యాలెట్‌ బాక్సుల్లో నుండి బయట పడింది. ఆ ప్రకటనలో ఏముంది అంటే…. ‘నంద్యాల తాగుబోతుల విన్నపం’ పేరుతో వేసిన చీటీల్లో.. మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లు అయిన సుప్రీం, దారు, హైదరాబాద్‌, జంబో తదితరాలను తొలగించి పాత బ్రాండ్లు అయిన రాయల్‌ స్టాగ్‌, ఇంపీరియల్‌ బ్లూ, బ్లాక్‌ డాగ్‌ రకాల అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తూ తెల్ల కాగితం మీద ముద్రించిన చీటీలు లభ్యమయ్యాయి. పాత బ్రాండ్లు అమ్మని పక్షంలో ఇదే తమ చివరి ఓటు అవుతుందని కూడా వారు హెచ్చరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.