వార్తలు (News)

వేదపాఠశాలలో మరొక పదిమందికి కరోనా సోకడంతో 67కి చేరుకున్న బాధితుల సంఖ్య

కరోనా అన్నిప్రాంతాలను వణికిస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మరొకసారి తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా 10 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. పాఠశాలలోనే ఉంటున్న ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు కరోనా సోకినట్లు తితిదే అధికారులు తెలిపారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని మెరుగైన చికిత్స కోసం పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.

ఈనెల 10న వేదపాఠశాలలో 57 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించడంతో కరోనా సోకిన వారి సంఖ్య 67కి చేరింది. ఈ వేద పాఠశాలలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన సుమారు 420 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.