వార్తలు (News)

ఏఏ బ్యాంకులు రెండు రోజులు అందుబాటులో ఉండవు?

బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయనున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు సోమవారం (మార్చి 15) మరియు మంగళవారం (మార్చి 16) ప్రభావితం కానున్నాయి. మార్చి 4, 9, 19 తేదీల్లో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మె బాట పట్టారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBC) ఇటీవల పిలుపునివ్వడంతో రెండు రోజులపాటు ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.

సమ్మె వల్ల బ్యాంకులలో డిపాజిట్లు మరియు విత్‌డ్రా, చెక్ క్లియరెన్స్ మరియు లోన్ అప్రూవల్స్ సహా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానుండగా, ఏటీఎం సేవలు మాత్రం అందించనున్నాయి. నేటి నుంచి 2 రోజులపాటు జరగనున్న బ్యాంకు సమ్మె(Bank Strike)లో 10 లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకుల అధికారులు పాల్గొంటారని యునైటెడ్ ఫొరం తెలిపింది. కాగా, ప్రైవేటు బ్యాంకులైన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ బ్యాంకులు యథాతథంగా విధులు నిర్వహిస్తున్నాయి.

సోమవారం నుండి రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (UFBC) తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సంస్థ, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC) మరియు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్లు (NOBO), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW) ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టుగా తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.