ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో బుధవారం ‘రాజ స్నానం’ కార్యక్రమంలో లక్షలమంది పాల్గొన్నారు. దేశంలో ఒకవైపు కరోనా ఉధృతి సాగుతున్నా కూడా మాస్క్ లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా వెలది మంది సాధువులు వచ్చి హర్ కీ పౌరీ ఘాట్ వద్ద గంగానదిలో స్నానాలు చేసారు. ఆచార్య కైలాసనంద గిరి ఆధ్వర్యంలో నిరంజని అఖాడాకు చెందిన నాగా సాధవులు ప్రధమ పవిత్ర స్నానం చేసారు. మొత్తం అఖాడాల సాధువులు వచ్చి ఇందులో పాల్గొన్నారు. ఒక్కో అఖాడాకు ఒక్క సమయం కేటాయించడంతో ఊరేగింపుగా వచ్చి స్నానాలు చేసారు. మొత్తం 13 . 5 లక్షల మంది స్నానాలు చేసారని అధికార వర్గాల సమాచారం!