దేశీయ మార్కెట్ లు గురువారం నాటి సెషన్‌లో సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడ్డాయి అలాగే నిఫ్టీ 14,500 మార్క్‌ను దాటింది. నేడు 48,512 పాయింట్లతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌ ఆరంభంలో కాస్త ఒడుదొడుకులను ఎదుర్కొని ఒక దశలో 48,010.55 కనిష్ఠ స్థాయికి పడిపోయి మళ్ళీ లోహ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో మళ్లీ పుంజుకుని 48,887 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి చివరకు 259.62 పాయింట్ల లాభంతో 48,803.68 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 76.70 పాయింట్లు లాభపడి 14,681.50 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, సిప్లా, విప్రో, అదానీ పోర్ట్స్‌ షేర్లు రాణిస్తే మారుతి సుజుకీ, ఐషర్‌ మోటార్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. లోహ, ఫార్మా రంగాల షేర్లు ఒక శాతం మేర లాభపడగా బ్యాంకింగ్, ఆటో షేర్లు నష్టాలను చవిచూశాయి.